పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాసరావుస్థానిక పూర్ణానందంపేటలోని శ్రీ షిర్డీ సాయి సత్సంగ మండలి (రి) ఆధ్వర్యంలో వెలసిన శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకలు
బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారికి ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ:
“సాయిబాబా చూపిన మార్గం సమాజానికి ఎంతో ఆదర్శనీయమని, శ్రద్ధ మరియు సబూరితో ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని కోరారు. పూర్ణానందంపేటలో సాయిబాబా ధ్యాన మందిరం 14 ఏళ్లుగా నిరంతర ఆధ్యాత్మిక సేవలు అందించడం సంతోషదాయకమని” పేర్కొన్నారు. విజయవాడ ప్రజలందరికీ బాబా వారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాం
క్షించారు.










