మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆల్వాల్ డివిజన్ కానాజిగూడ లో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.
అంబేద్కర్ నగర్, కానాజిగూడ పెట్రోల్ బంక్, భూదేవి నగర్ ప్రాంతాల్లో డివిజన్ అధ్యక్షులు గోగురి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలు దేశానికి శాశ్వత మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మహిళా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు మరియు అంబేద్కర్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










