ప్రజల ముంగిటకే పరిపాలన: అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

0
3

ప్రభుత్వ పనితీరు క్షేత్రస్థాయిలో ప్రజలకు స్పష్టంగా కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ కేంద్రం నుండి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.

జూన్ నాటికి సంక్షేమ హాస్టళ్లను పూర్తిస్థాయి వసతులతో సిద్ధం చేయాలన్నారు. పట్టణాల్లో తాగునీరు, పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు రాకూడదని, అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. సాంకేతికతను జోడించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.