మహాత్మా జ్యోతిబాపూలే మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతుల సందర్భంగా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో CITU ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది యువ కార్మికులు రక్తదానం చేశారు.
ముఖ్యంగా తలసేమియా రోగులకు ప్రాణదానం చేసే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక బాధ్యతగా భవిష్యత్తులో మరిన్ని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, రక్తదానం చేసిన యువతకు యూనియన్ తరపున అభినందనలు తెలుపుతున్నామని రాజారెడ్డి పేర్కొన్నారు.










