తెలంగాణ ఉన్నత విద్యామండలి 2026-27 విద్యా సంవత్సరానికి గానూ దోస్త్ (DOST) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ సీట్ల భర్తీకి ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు రూ.200 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం మూడు విడతల్లో ప్రక్రియ జరగనుండగా, మే 14న తొలి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 20-27 మధ్య కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. జూలై 1 నుండి తరగతులు ప్రారంభమవుతాయి. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు.




