పుంగనూరు: వారిపై వెంటనే చర్యలు

0
2

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులపై హింసను ప్రేరేపించేలా మాట్లాడారని ఆరోపిస్తూ, వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్ పట్టణ సిఐకి వినతిపత్రం అందజేశారు. ఖర్గే మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులను ‘విషనాగులు’ అని సంబోధించి, వారిని చంపాలని అనడం ద్వారా సమాజంలో మత విద్వేషాలను రేకెత్తించడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అయూబ్ ఖాన్ పేర్కొన్నారు# కొత్తూరు మురళి.