ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 27వ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు శ్రీపాదరావు గారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ వరకు అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడని కొనియాడారు. శాసనసభ ఔన్నత్యాన్ని పెంపొందిస్తూ సభను ఎంతో హుందాగా నడిపిన తీరు శ్లాఘనీయమని అన్నారు. శ్రీపాదరావు గారి జీవితం నేటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తి అని ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు పాల్గొన్నారు.










