రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: డీసీపీ రామ్‌రెడ్డి.

0
2

రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో ‘అరైవ్ లైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి, మేయర్ మహంకాళి స్వామి, ఏసీపీ రమేష్ పాల్గొని ప్రసంగించారు.

డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని డీసీపీ పేర్కొన్నారు. వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుతూ, అందరితో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.