పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు

0
4

పుంగనూరులో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్ లో అధికారులు మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

అనంతరం 1944 ముంబై ఓడరేవు అగ్ని ప్రమాదంలో మరణించిన సిబ్బందికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు.