పుంగనూరు గంగమ్మకు ఘనంగా అభిషేకం, మహిళల హారతులు

0
1

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బెస్తవీధిలోగల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు.

ఈ సందర్భంగా ప్రాంతానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి మహా మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు# కొత్తూరు మురళి.