కుప్పం ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను రూ.75 కోట్లతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డీపీటీఓ రాము తెలిపారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, సీఎం చంద్రబాబు స్త్రీ శక్తి,
దివ్యాంగ శక్తి కార్యక్రమాలను ప్రారంభించారని వారు పేర్కొన్నారు. త్వరలోనే కుప్పం డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం జరుగుతుందని, ప్రయాణికులతో సిబ్బంది గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు# కొత్తూరు మురళి.










