మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన :ఎంపీ వంశీ కృష్ణ

0
11

మంచిర్యాల : డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వంశీ కృష్ణ పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవలు అపారమని కొనియాడారు సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి భారతీయుడికి ఆదర్శమని పేర్కొన్నారు.

అంబేద్కర్ గారు చూపిన మార్గం సమాజ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని చెప్పారు . విద్య, చైతన్యం, ఐక్యతతోనే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.