మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బుధవారం మోండా డివిజన్లో రూ.28 లక్షల వ్యయంతో చేపట్టిన సిమెంట్ కాంక్రీట్ (సీసీ) రోడ్డు పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం కింద హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మోండా డివిజన్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ రోడ్డు పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి డీసీ డాకు నాయక్, ఏఈ వరుణ్ దేవ్, సందీప్, గణేష్ టెంపుల్ ఛైర్మన్ ప్రభాకర్ యాదవ్‌తో పాటు నాయకులు నాగేష్ యాదవ్, సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, ధనలక్ష్మి, శేఖర్ ముదిరాజ్, శ్రీనాథ్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju










