మదనపల్లె మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పచ్చిపాల తులసిని రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా అధిష్ఠానం బుధవారం నియమించింది. మంగళగిరి ఆత్మకూరులోని ఎన్టీఆర్ భవన్లో ఆమెకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇప్పటికే ఆమె భర్త రామకృష్ణ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
సీనియర్ మహిళా నాయకురాలైన తులసికి రాష్ట్ర స్థాయి పదవి రావడంపై పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









