విజయ జూనియర్ కళాశాల విజయ ప్రభంజనం

0
0

మంగళగిరిలోని విజయ (వి.జె) జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎన్. బిందు పల్లవి (988), బైపీసీలో ఎన్. శ్రీ ఉపేంద్ర (972) టాపర్లుగా నిలవగా, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో వి. జస్మిత రెడ్డి (465) విశేష మార్కులు సాధించారు.

ఎంఈసీ, సీఈసీ విభాగాల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి కళాశాల కీర్తిని చాటారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ ప్రెగడ రాజశేఖర్, ప్రిన్సిపల్ అవ్వారి సత్యనారాయణ విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని ఘనంగా అభినందించారు.