మానవత్వం చాటుకున్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
0

నరాల బలహీనత అంగవైకల్యంతో బాధపడుతున్న మయాన వసీంకు వీల్ చైర్ పంపిణీ చేసిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు చిన్నమండలం టౌన్ కు చెందిన కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న మయాన అబ్బాస్ అలీ ఖాన్ కుమారుడు వసీమ్ నరాల సంబంధిత సమస్య కారణంగా నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక టిడిపి మైనార్టీ నాయకులు ప్రసాద్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్లారు

ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ప్రసాద్ బాబు గారు స్వయంగా చిన్నమండెం చేరుకుని వసీం గారికి వీల్ చైర్ అందజేశారు దీంతో వసీమ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రసాద్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ వసీమ్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అవసరమైన సహాయం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సమాజంలో ఇలాంటి నిరుపేద కుటుంబాలకు ఆదుకోవడం మన బాధ్యతని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు