పుంగనూరులో బుధవారం నాడు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి సుబ్రమణ్యం తెలిపారు.
ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ సిబ్బంది మార్కెట్ యార్డ్ నుంచి ముడెప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ దగ్గర వాటర్ డ్రిల్ విన్యాసాలు నిర్వహించారు, దీనిని పెద్ద సంఖ్యలో ప్రజలు తిలకించారు.










