తపాలా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పథకం కింద నగదు ప్రోత్సాహం

0
3

నందిగామ ఎన్టీఆర్ జిల్లా2025 సంవత్సరమునకు గాను తపాలా శాఖ వారు నిర్వహించినటువంటి దీన్ దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్ పరీక్షలో నందిగామ కాకతీయ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని అందులో భాగంగా విజేతలైన విద్యార్థులకు 6000 క్యాష్ ప్రైస్ మరియు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ విజయవాడ డివిజన్ విజయవాడ శ్రీ ఎం నరసింహస్వామి తెలిపారు.

రాష్ట్రస్థాయిలో నిర్వహించినటువంటి తపాలా స్కాలర్షిప్ పరీక్షలో 40 విజేతలకు గాను 6 గురు కాకతీయ స్కూల్ నుండి ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమని విద్యార్థులకు మరియు కాకతీయ స్కూల్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ విధముగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి తపాలా శాఖ స్కాలర్షిప్ పరీక్షల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగా విద్యార్థులు ఎక్కువ మొత్తంలో పాల్గొనాలని నరసింహ స్వామి పిలుపునిచ్చారు. మరియు జాతీయస్థాయిలో జరిగేటువంటి ఫిలాటిలిక్ ఎగ్జిబిషన్ లో భాగంగా పేరున్న ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు వారి యొక్క జాతీయ స్థాయి గుర్తింపు నిమిత్తం కార్పొరేట్ మరియు కామెమోరాటివ్ స్టాంప్స్ రిలీజ్ కు ముందుకు రావలసిందిగా  ఎం. నరసింహస్వామి  అభ్యర్థించారు. ఈ కార్యక్రమమునకు నందిగామ పోస్టల్ ఇన్స్పెక్టర్ లాహోరి విష్ణు, కాకతీయ స్కూల్ డైరెక్టర్ కార్తికేయ స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ సిబ్బంది మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.