పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం

0
0

చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం పుంగనూరు మండలం, బయలు గాని పల్లిలో బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖానా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అయూబ్ ఖానా మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు అడ్డంకులు సృష్టించడం దారుణమని విమర్శించారు# కొత్తూరు మురళి.