మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం నాణ్యతను పరిశీలించి, రసాయన విశ్లేషణ కోసం నమూనాలను సేకరించారు.
దుకాణాలు ఉదయం 10 గంటలకు తెరిచి, రాత్రి 10 గంటలకు మూసివేయాలని, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు










