విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి లేని డీఈవో ని సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరులో స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ అఫ్రీది, పి ఆర్ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర నాయకులు రఘునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు డీఈఓ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూల్ జిల్లా లోని విద్యారంగా సమస్యలు ని పరిష్కరించడం లో పూర్తి గా విఫలమయ్యారని ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని సమస్యలు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే
వారు డీఈవో గారికి తెలియజేసే విచారణ చేయమని ఆదేశించిన కానీ డి ఈ ఒ మాత్రం పశ్చిమ ప్రాంతం సమస్యలు పట్టించుకోకుండా కేవలం తన కార్యాలయనీకె పరిమితమయ్యారని ఇక్కడ సమస్యలపై ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఈఓ గారు సమస్యలపై విచారణ చేసి నివేదిక పంపించడం జరుగుతుంది కానీ డీఈవో ఆ నివేదికల ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోడాన్ని చూస్తూ ఉంటే అనుమానాలు కలుగు తున్నాయి యని వారుఅన్నారు. ఇప్పటికైనా ఆర్జెడి మరియు విద్యాశాఖ కమిషనర్ వారు స్పందించి తక్షణమే డిఈ ఒ గారి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీఈఓ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహనాయుడు లక్ష్మన్న వెంకటేష్ అశోక్ హేమాద్రి నిఖిల్ విజయ్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.










