ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ. 76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం ద్వారా ఏప్రిల్ 20న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు పూర్తి ఉచితంగా భోజనం అందించనున్నారు. అన్న క్యాంటీన్లు అమ్మను తలపిస్తున్నాయని.
రూ. 5లకే గౌరవప్రదంగా పౌష్టికాహారం అందించడం మహోన్నత కార్యక్రమని ఆమె కొనియాడారు. ప్రజలు తమ పుట్టినరోజులు, శుభకార్యాల సందర్భంగా అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి పేదల ఆకలి తీర్చాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు భువనేశ్వరి పిలుపునిచ్చారు.










