విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు బాపట్ల ఎస్పీ అభినందించారు.

0
1

iGOT లొ అత్యధిక శిక్షణ తరగతులు పూర్తి చేసిన 8 మంది పోలీసులు, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 3 వేరువేరు మహిళా మిస్సింగ్ కేసులను చేదించిన శక్తీ బృందం సభ్యులుకు శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయాల సమావేశ హాలు నందు నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో వీరికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా అందజేసినారు.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన రేపల్లె, చీరాల సబ్ డివిజన్ ల శక్తీ బృందం కానిస్టేబుల్ లు వై.గోపీనాథ్, కె.సుబ్బారావు లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.

వేటపాలెం పోలీస్ స్టేషన్ లలో నమోదైన 2013, 2015 సంవత్సరాలకు చెందిన రెండు వేర్వేరు మహిళా మిస్సింగ్ కేసులను కె. సుబ్బారావు లు ట్రేస్ చేసి బాధితుల ఆచూకీ కనుగొన్నారు.