నిబంధనలకు విరుద్ధంగా అధిక పెన్షన్ పొందుతున్న ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులపై బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడిట్లో ఈ అక్రమం వెలుగుచూడటంతో, పెన్షన్ సొమ్మును తిరిగి చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చారు.
అయినా వారు స్పందించకపోవడంతో, సబ్ ట్రెజరీ అధికారి (STO) పద్మనాభం ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
#Boiena Rajesh










