తెలంగాణ సత్తెమ్మకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నీటి నివాళి

0
2

వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ… ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోశారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు.

ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, “జై తెలంగాణ” నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె.

‎స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ కేటీఆర్ ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.