“హరిజనబస్తీ డిసిల్టింగ్‌పై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఫోకస్.|

0
13

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హరిజనబస్తీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డిసిల్టింగ్ (మట్టిని తొలగించే) పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా వర్క్ ఇన్‌స్పెక్టర్ చందు, ప్రేమ్, మహేందర్, అంజయ్య, మహేష్, వీరమణి తదితరులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.

పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా మట్టిని పూర్తిగా తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

#sidhumaroju

Alwal