పుంగనూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు

0
3

పుంగనూరు మండలం గాంధీపురం సమీపంలో 42వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పెద్దపంజాని మండలం వీరప్పల్లి గ్రామానికి చెందిన శివకుమార్ (27), కుదవపల్లి గ్రామానికి చెందిన ఆంజప్ప (45) తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి, గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.