నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ

0
2

నందవరం కేజీబీవీలో విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్, సిబ్బంది ఆడుతున్న చలగాటం కలకలం రేపుతోంది. ఈ నెల 17న భోజనంలో బల్లి పడిందని విద్యార్థులు మొరపెట్టుకున్నా, నిర్లక్ష్యంగా అదే ఆహారాన్ని వడ్డించారు.

దీనివల్ల సుమారు 200 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని బయటపెడితే టీసీలు ఇచ్చి పంపిస్తామంటూ ప్రిన్సిపల్ బెదిరించడం దారుణం. ఎండాకాలం సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ గోడును తల్లిదండ్రులకు తెలపడంతో ఈ దారుణం వెలుగుచూసింది. అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సోమవారం కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామని బాధితులు మరియు బీజేపీ శ్రేణులు హెచ్చరించారు.