అమ్మ చెరువుమిట్టలో మందుబాబుల వీరంగం: బస్సు సిబ్బందిపై దాడి.

0
2

మదనపల్లె పట్టణంలో మంగళవారం కదిరి రోడ్డులోని అమ్మ చెరువుమిట్ట వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ముందు అడ్డదిడ్డంగా వెళ్లారు.

డ్రైవర్ కండక్టర్లు మందలించడంతో ఆగ్రహించిన యువకులు వారిపై దాడి చేసి వీరంగం సృష్టించారు. ప్రయాణికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, యువకులు పరారయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.