జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధి మార్గంలో గ్రామ పంచాయతీలే కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
🔹 “గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు – అనే సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రజాప్రభుత్వం అందుకు కట్టుబడి పనిచేస్తుంది. స్థానిక స్వపరిపాలనకు ప్రతీకలైన పంచాయతీలు బలంగా, సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది.
🔹 భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు లభించిన స్వయం పరిపాలన హక్కులు ప్రజాస్వామిక వికేంద్రీకరణకు దిశానిర్దేశం చేశాయి. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనలో పంచాయతీ రాజ్ సంస్థలు సాధికారత, సామర్థ్యం, జవాబుదారీతనం పెంపొందించుకోవడం అత్యంత అవసరం.
🔹 స్థానిక స్వయం పరిపాలన గ్రామీణ ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులతో పాటు స్వయం సమృద్ధి దిశగా గ్రామీణ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుంది” అని ముఖ్యమంత్రి గారు ఒక సందేశంలో పేర్కొన్నారు. National Panchayat Raj Day










