పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
0

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ , మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీపై స్పందించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థాపించిన పార్టీని BRS అనాలా, TRS అనాలా అన్న గందరగోళంలో ప్రజలు ఉన్నారని అన్నారు.

కవిత ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు.

BRS అయినా, TRS అయినా పరిస్థితి ఒకటేనని, నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

కల్వకుంట్ల తారక రామారావు అహంకారం కారణంగానే కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపి, సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.

కార్మికులకు భరోసా కల్పించడంతో సమ్మె విరమించారని, ప్రజా ప్రభుత్వం కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుందని చెప్పారు.

గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలను BRS పట్టించుకోలేదని విమర్శించారు.

కవిత కొత్త పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని, అది BRS ఓట్లను చీల్చుతుందని అన్నారు. BRS మరియు KTR కు నష్టం ఉంటుందని, కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు.