వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి :డి ఎం హెచ్ ఓ.

0
3

అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య ప్రజలను వడగాల్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎల్నీనో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మధ్యాహ్నం విద్యార్థులు, పిల్లలు బయటకు వెళ్లవద్దని కోరారు.

మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, ఎక్కువ నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు