మంగళవారం, వి. కోటలో ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మదనపల్లె కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి, హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.








