మదనపల్లెలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాల పంపిణీ.

0
3

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు.

కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.