“వాసవీ జయంతికి సెలవు: సీఎంలకు కైలాష్ రాంచెందర్ గుప్త ధన్యవాదాలు.|

0
37

హైదరాబాద్ : వాసవీ మాత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించడం పట్ల ఆలిండియా వైశ్య ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేస్తోంది.

ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ఫెడరేషన్ సెక్రటరీ కైలాష్ రాంచెందర్ గుప్త  మాట్లాడుతూ.. అహింసా మూర్తి, త్యాగశీలి అయిన వాసవీ మాత జన్మదినానికి ప్రభుత్వ గుర్తింపు లభించడం యావత్ ఆర్యవైశ్య జాతికి గర్వకారణమని కొనియాడారు.

ఈ గౌరవం దక్కడం వెనుక ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆల్ ఇండియా అధ్యక్షులు, వార్త సీఎండీ, మాజీ రాజ్యసభ సభ్యులు గిరీష్ సంఘీ  అలుపెరుగని కృషి ఎంతో ఉందని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆర్యవైశ్యుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన గిరీష్ సంఘీ కి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే, ఈ ఉద్యమంలో నిరంతరం తోడుగా నిలిచిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ  సేవలను కూడా ఆయన కొనియాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆర్యవైశ్యుల మనోభావాలను గౌరవించి, ఈ పండుగకు అధికారిక గుర్తింపునివ్వడం వారి పరిపాలన దక్షతకు నిదర్శనమని కైలాష్ రాంచెందర్ గుప్త  ప్రశంసించారు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వాసవీ మాత జయంతిని అధికారికంగా గుర్తించి సెలవు దినంగా ప్రకటించినందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవాన్ని గౌరవించడం పట్ల సమాజం తరపున ధన్యవాదాలు అర్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

#sidhumaroju