పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద ఎల్లకుంట్ల పంచాయతీ చిప్పిలేవారిపల్లి గ్రామంలో గురువారం రాత్రి హోంగార్డులు ముని, హరిబాబుల మధ్య జరిగిన గొడవలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో హోంగార్డు మునికి చెందిన కారును ప్రత్యర్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో అది పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనపై చౌడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.










