అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్.

0
0

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కోర్సులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 20 లక్షల మంది యువతకు పూర్తి నైపుణ్యంతో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ.

క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పాఠ్యాంశాలను రూపొందించడంతో పాటు, ఉపాధ్యాయులకు ఫిన్‌లాండ్ వంటి దేశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. యువత నైపుణ్యాన్ని అంచనా వేయడానికి ‘ర్యాండమ్ స్కిల్ ఆడిట్’, ఉద్యోగ సమాచారం కోసం ‘నైపుణ్యం’ అనే సమీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నారు.