ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డు అందుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మంత్రులు ఆయన పనితీరును కొనియాడారు. “పట్టిసీమ ద్వారా రూ.50 వేల కోట్ల సంపదను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు” అని మంత్రి నిమ్మల పేర్కొనగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుండి రూ.11 వేల కోట్లు ఇప్పించడం ఆయన గొప్పతనమని మంత్రి సత్యకుమార్ వివరించారు.
పరిశ్రమల గ్రౌండింగ్ కోసం 90 మంది అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తమను పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాజకీయాల్లో ‘రిఫార్మర్’ పదానికి చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని మంత్రులు ఏకగ్రీవంగా వ్యాఖ్యానించారు.










