నల్లబెల్లి మండలం గుండ్లపాడులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
45 డిగ్రీల ఎండలో రైతులు 40 రోజులుగా నిరీక్షిస్తున్నా, కేవలం 20 శాతం కొనుగోళ్లు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. అధికారుల సమన్వయ లోపం, గన్ని సంచుల కొరత వల్ల రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో 42 కేంద్రాలు ఉండగా, ఇప్పుడు కేవలం 6 కేంద్రాలతో సరిపెట్టడం దారుణమన్నారు. రైతులకు మద్దతుగా శుక్రవారం నుంచి నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.








