కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ రీపోటర్ జగదీష్ చునర్కర్
“స్వీయ గణన-జనగణమనకు ప్రకతిఒక్కరూ సహకరించాలి:కలెక్టర్ హరిత
మన జనగణమన-మనభివృద్ధిలో భాగగంగా జనాభా గణన 2027 మొదటి విడతలో ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణన తమ ఇంటివివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ హరిత అన్నారు.సమీకృత కలెక్టరెట్ లో స్వీయ గణన ఉపాధి హామీ నకిలీ విత్తనాలు. ఇందన కొరత, యాసంగి వరి ధాన్యం కొముగోలుపై విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ ఎం. డేవిడ్ కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా , ఆసిఫాబాద్ ఆర్.డి.ఓ లోకేశ్వర్ రావ్ తో కలిసి పాల్గొన్నారు.జనగాణన మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన చచేపడతామని, ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి అన్ లైన్ లో వివరాలు నమోదు చేస్తారని తెలిపారు.
స్వీయ గణన ద్వారా 33 అంశాల వివరాలను ఆన్ లైన్ లో చేసుకోవచ్చని, ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు వాటిని పరిశీలిస్తారన్నారు జిల్లాలో 994 ఎన్యుమరేటర్లు.174 మంది సూపర్ వైజర్లు 1689 హౌస్ లిస్టింగ్ బ్లక్ లను గుర్తించన్నారు ఉపాధి హామీ పనిప్రదేశాలలో కూలీలకు నీడ త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని, ఎండ తీవ్రత దృశ్య ఉదయం 10 గంటలలోపు పనిని పూర్తిచేసుకోవాలని. సూచించారు. ఇందనం.విత్తనాలు జిల్లాలో పెట్రోల్, డీజీల్ కొరత లేదని డిమాండ్ కు తగ్గట్టు సప్లై ఉందని పుకార్లు నమ్మవద్దన్నారు. ఖరీఫ్ సీజన్ దృష్యా నకిలీ పత్తి విత్తనాలు మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఆన్ లైన్ రసీదులు తీసుకోవాలని. ఫర్టిలైజర్ షాపుల యజమానులు ఒత్తిడి చేయవదన్నారు. ధాన్యం కొనుగోలు యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు 34 కేంద్రాలు ఏర్పాటుచేశామని.ప్రతి కేంద్రంలో త్రాగు నీరు నీడ.వెలుతురు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు.ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389. సాధారణ రకం ధాన్యానికి రూ. 2369.మద్దతు ధర ఉందని సన్నరకం వారి దాన్యానికి క్వింటాలుకు రూ. 500.బోనస్ ఉందన్నారు.కొనుగులు. రైస్ మిల్లులకు తరలింపు పూర్తిగా డిజిటల్ యాప్ ద్వారా జరుగుతుందన్నారు.స్వీయ గణన ఇళ్ల గణన విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవారెడ్డి.వ్యవసాయ శాఖ అధికారి వెంకటి.జిల్లా అధికారి సంపత్ కుమార్.సంబంధిత అధికారులు పాల్గొన్నారు.








