అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, మార్కెట్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ జంగాల శివరాం అధ్యక్షతన సోమవారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బైపాస్ రోడ్డులో 28 ఎకరాల్లో కొత్త మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. సివిల్ పనులు, వేస్ట్ మేనేజ్‌మెంట్, రైతుల కోసం కాంటీన్ ఏర్పాటు పై టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ వద్ద రోడ్డు ఆక్రమణలు వెంటనే తొలగించాలని ఆదేశించారు. మార్కెట్ తరలింపుతో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు మదనపల్లి టమోటా మార్కెట్‌కు కొత్త దిశానిర్దేశం చేయనున్నాయి.







