మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు కొత్త అడుగు వేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన 10 ఆధునిక ట్రాఫిక్ కంట్రోల్ బూత్‌లను ప్రారంభించారు.
పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ బూత్‌ల ద్వారా ట్రాఫిక్ సిబ్బందికి ఎండ, వానల నుంచి రక్షణతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలు నివారించేందుకు పోలీసులకు సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.










