పోలవరం జిల్లా రైతులకు సబ్సిడీ పై యంత్రాలు.

0
4

వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోలవరం జిల్లాలోని రైతులు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పొందేందుకు సువర్ణావకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహనరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.40HP సామర్థ్యం గల ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు .

పవర్ స్ప్రేయర్లు వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.ఈ పరికరాలపై ప్రభుత్వం 40% నుండి 50% వరకు సబ్సిడీ అందిస్తోంది.ఆసక్తి గల రైతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.రైతులు తమ వివరాలను eseed.ap.gov.in/FM/Portal వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం లేదా దరఖాస్తు ప్రక్రియలో సహాయం కోసం రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకులను (VAA) సంప్రదించాలని అధికారులు కోరారు. ఆధునిక యంత్రాలను వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.

 

# Yadagiri