*పేద ముస్లిం విద్యార్థులను మేం చదివిస్తాం*
*కీలక నిర్ణయం తీసుకున్న వక్ఫ్ బోర్డ్*
*చదువులో మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు ఉచిత ఇంటర్ విద్య*
*దేశ చరిత్రలో ఈ నిర్ణయం ఒక నూతన అధ్యాయం*
*టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతావుల్లా*
విజయవాడ( ఎంపీ కార్యాలయం) పేద ముస్లిం విద్యార్థులు చదువుకునే స్తోమత లేక ఆగిపోయే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా గురునానాక్ కాలనీ లోని విజయవాడ ఎంపీ కార్యాలయం నందు టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహమ్మాద్ ఫతావుల్లా మీడియా సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఫతావుల్లా మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 500 మంది పేద ముస్లిం విద్యార్థులను ఉచితంగా ఇంటర్మీడియట్ ఏ కార్పొరేట్ కళాశాలలోనైనా చదివించే విధంగా నిర్ణయం తీసుకోవడం గొప్ప పరిణామం అని ఫతావుల్లా అన్నారు.విద్యకు పేదరికం అడ్డుకాకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనని దాన్ని అక్షరాల పాటించే దిశగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆచరణలోకి తీసుకువచ్చారని తెలిపారు
ముస్లిం పేద విద్యార్థులంతా ఈ సదఅవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు.ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవడం ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఈనెల 12 న ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అని విద్యార్థులకు తెలియజేశారు.ఈనెల 17న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా ప్రధాన కేంద్రాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారని ఈ టెస్ట్ లో పాస్ అయిన వారికి ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించనున్నట్లు తెలియజేశారు. వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ పై తప్పుడు వ్యాఖ్యలు చేయడం మానేసి అభివృద్ధి వైపుకి రాష్ట్రాన్ని నడిపించే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన విధానాన్ని చూసి నేర్చుకోవాలని సూచించారు….
ఈ కార్యక్రమం లో పశ్చిమ నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షులు తమిమ్ అన్సర్ సెంట్రల్ నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షులు గౌస్ బాషా తూర్పు నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షులు షరీఫ్ సీనియర్ మైనారిటీ నాయకులు అబ్దుల్ ఖాళీక్ ఇర్ఫాన్ 54 వ డివిజన్ క్లస్టర్ కరీముల్లా, నాయకులు అబ్దుల్ కరీం,సయ్యద్ అలీ,










