పుంగనూరు ఏడి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు వంటి వ్యవసాయ పరికరాలను రైతులకు సబ్సిడీ ధరలకు అందించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు 40-50% సబ్సిడీ లభించనుంది. ఆసక్తి గల రైతులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని గురువారం సూచించారు# కొత్తూరు మురళి.










