చింతూరు పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూగజీవాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి ముఖ్యంగా ఆవులపై గుంపులు గుంపులుగా దాడి చేస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం గత పది రోజుల క్రితమే ఒక తల్లి ఆవుపై దాడి చేసిన కుక్కల మంద, దాన్ని చంపి తినేశాయి. ఆ ఘటన మరువక ముందే, తాజాగా ఆ తల్లి ఆవు దూడను కూడా అదే రీతిలో చంపి తినేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. కుక్కలు మృగాల్లా మారి ఇలా వరుసగా పశువులపై దాడులు చేస్తుండటంతో.
అటు పశుపోషకులు వణికిపోతున్నారు ఆవులపై ఈ కుక్కల గుంపులు పడి, వాటిని పీక్కుతింటున్న వైనం స్థానికులను కలచివేస్తోంది.కుక్కల బెడద రోజురోజుకూ మితిమీరిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ఈ కుక్కల స్వైర విహారానికి అడ్డుకట్ట వేయాలని, ప్రజల ప్రాణాలకు, పశువులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
# Yadagiri










