పోలవరం జిల్లాకు గుండెకాయలాంటి మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డు సోమవారం ఉదయం స్తంభించిపోయింది. జేసీబీ లోడుతో వెళ్తున్న ఒక భారీ లారీ, ప్రమాదకరమైన మలుపు వద్ద సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
రోడ్డుకు అడ్డంగా లారీ నిలిచిపోవడంతో రెండు వైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ఈ మార్గం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కలిపే కీలక రహదారి కావడంతో వందలాది వాహనాలు రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
# Yadagiri










