ఏపీలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు

0
4

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

Andhra Pradesh State Disaster Management Authority తెలిపిన వివరాల ప్రకారం అల్లూరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పులు వీచనున్నాయి. కర్నూలు జిల్లా నాగరడోనలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాల సమయంలో చెట్ల కింద నిలవవద్దని, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.