Andhra Pradesh State Election Commission రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసి, డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ Anil Chandra Punetha అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 123 పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజన కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక జూన్‌లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 13,291 పంచాయతీల ఓటర్ల జాబితాలు ప్రచురించినట్లు అధికారులు వెల్లడించారు.









