తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్‌పర్సన్‌తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీచేశారు.
కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత,శశికళా యాదవరెడ్డి, సదాలక్ష్మి, ఎన్ రాధాబాయి,ఉజ్మా ఆషై షకీరాను సభ్యులుగా నియమించారు.ఐదేండ్లపాటు వారు ఈ పదవు ల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాగా కాంగ్రెస్ అసలు నేతల కు రేవంత్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించి,వలస కాంగ్రెస్ నేత విజయలక్ష్మికే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి ఇస్తున్నారని అనుకున్నది నిజంగానే అయింది వలస కాంగ్రెస్‌కే మరో పదవి శీర్షికతో ఈ ఏడాది ఫిబ్రవరి 4న కథనం ప్రచురించింది.
పార్టీ కోసం కష్టపడిన మాజీ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కేవలం 14 నెలలు మాత్రమే పని చేశారని,కానీ సీఎం మాత్రం..
బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చిన కేశవరావు కుమార్తె విజయలక్ష్మి కోసం సీటు రిజర్వ్ చేసిపెట్టారని కథనంలో వివరించింది. ఈ కథనంపై అప్పట్లో కాంగ్రెస్ పార్టీవర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
కాగా చివరికి ఆమెకే అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.









